కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.