BHPL: రేగొండ మండలంలోని ప్రసిద్ధ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆదివారం BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నూతనంగా ఆలయ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.