MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వ్యవసాయ కార్మిక సంఘం ఘనంగా నిర్వహించింది. కడియాల మోహన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశ సమగ్రతకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.