MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 25వ వార్డ్ అంగన్వాడీ సెంటర్లో శనివారం నిర్వహించిన అక్షరాభ్యాసం, సామూహిక అన్న ప్రాసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. అంగన్వాడిలో బాలింత తల్లులకు, పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కంకటి ప్రణిత పాల్గొన్నారు.