RR: రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కడ్తాల్ మండల కేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మండల అధ్యక్షుడు బోసు రవి ఆధ్వర్యంలో ఎంపీ తేజస్వి సూర్య దిష్టి బొమ్మను ఇవాళ దహనం చేశారు. క్యామ రాజేష్, ఎం.డి. షాబుద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఎన్నో త్యాగాల ఫలితమని, దాన్ని అవమానించడం ఖండిస్తున్నామన్నారు.