MLG: గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రవీందర్ ఇటీవల తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. వెంటనే బాధితుడు పస్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ఫోన్ IMEI నంబర్ ఆధారంగా సాంకేతిక విశ్లేషణ చేసి ఫోన్ ఆచూకీ కనిపెట్టారు. శుక్రవారం సాయంత్రం పస్రా పోలీస్ స్టేషన్లో రెండో SI ఎర్రయ్య బాధితుడికి ఫోన్ను అందజేశారు.