సంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రావీణ్య హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మొదటి జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జర్నలిస్టుల దరఖాస్తుల వివరాలను అధికారులు తెలుసుకున్నారు. అర్హులందరికీ కార్డులు మంజూరు చేయాలని సూచించారు.