PDPL: యువతకు శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన మంథనిలోని టాస్క్ సెంటర్ను సందర్శించారు. అవసరమైన పక్షంలో మరో భవనం నిర్మించాలన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా TGIIC ఆధ్వర్యంలో గార్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 2 ఎకరాల స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.