NZB: జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో రవాణా వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల పరిధిలో రోజూ 647 బస్సులు, 2.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ రూ.1.50 కోట్ల ఆదాయాన్నిఆర్జిస్తున్నాయి. సమ్మె జరిగితే ఈ ఆదాయానికి గండి పడటంతో పాటు, నిత్యం ప్రయాణించే వేలాది మందికి రవాణా కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.