KMM: జిల్లాలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.