KNR: కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పైకి వేరుగా కనిపించినా లోపల ఒకటేనని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విచారణ ప్రారంభించలేదన్నారు. రాష్ట్రం విచారణకు సిద్ధమైతే కేంద్రం ముందుకు వస్తుందని, సీఎం అధికారికంగా లేఖ రాయాలని కోరారు.