MDK: రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన చిలివిరి దీక్షిత ఇంటర్ ఫలితాల్లో మెరుపులు మెరిపించింది. ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్న ఈమె 1000 మార్కులకు 987 సాధించి సత్తా చాటింది. గ్రామానికి కీర్తి తెచ్చిన దీక్షితను గ్రామస్తులు ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.