గద్వాల జిల్లాలో బీజేపీపై బీఆర్ఎస్వి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలని, ఎంపీ తేజస్వి సూర్యను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కురువ పల్లయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును అవమానించే వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.