MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు నీడ ఏర్పాటు చేశారు. సర్పంచ్ ధరావత్ భాస్కర్ ఆధ్వర్యంలో నీడను ఏర్పాటు చేసి కూలీలతో మాట్లాడారు. కూలీలు వేసవి ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఉదయంనే పనులకు వెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత ఏర్పడక ముందే పనులు ముగించుకొని ఇంటికి రావాలని కూలీలకు సర్పంచ్ భాస్కర్ సూచించారు.