BHNG: కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో యాదాద్రి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, రూ. 1000 కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ నేత యానాల దామోదర రెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు, నేతలు ఉన్నారు.