సూర్యాపేట జిల్లాలో వేసవిలో త్రాగు నీరు ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో వివిధ శాఖల పనితీరు, చేపట్టవలసిన పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.