ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గ్రామంలో మంగళవారం పెళ్లి కట్నానికి వ్యతిరేకంగా గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇకపై గ్రామంలో ఎలాంటి వరకట్నాలు తీసుకోరాదని నిర్ణయించారు. ఈ సందర్భంగా వరుడు పూసం రాజ్‌కుమార్ వివాహానికి రూ. 25,500 ఆర్థిక సాయం అందజేశారు. గ్రామ పటేల్ పెందోర్ అమృతరావు, సర్పంచ్ మాడవి పైకు, గ్రామస్థులు పాల్గొన్నారు.