RR: షాద్నగర్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ఓ దున్నపోతు మృతి చెందింది. శ్రీనగర్ కాలనీకి చెందిన వెంకటేష్ అనే రైతు పొలంలో దున్నపోతు మృతి చెంది కనిపించడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భారీ వర్షానికి పిడుగు పడి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరారు.