ELR: కైకలూరు నియోజకవర్గంలో 22(ఏ) భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు తెలిపారు. జిల్లాలో 22 (ఏ) భూ సమస్యల పరిష్కారాలపై మంగళవారం భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.