SDPT: హుస్నాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 3 వ వార్డు లో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి – కొమురయ్య ఆధ్వర్యంలో చెత్త విభజనపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా పరిసరాల పరిశుభ్రతను కాపాడవచ్చన్నారు. తడి చెత్తతో కంపోస్ట్ ఎరువు, పొడి చెత్తతో పునర్వినియోగ వస్తువులు తయారు చేయవచ్చని అవగాహన కల్పించారు.