KNR: అత్యుత్తమ విద్యా బోధనకు కేరాఫ్ అడ్రస్‌గా మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాన్ని తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. అత్యుత్తమ విద్యను బోధించాలని మంచి ఫలితాలు సాధించి గురుకులాన్ని టాప్‌లో నిలబెట్టాలని పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.