NZB: చందూర్ మండలం వకీల్ ఫారం వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం వర్ని మండలం శంకొరా గ్రామానికి చెందిన గోపాల్ వకీల్ ఫారం వద్ద బైక్పై నుంచి పడ్డాడు. దీంతో అతని నాలుక తెగి తీవ్ర గాయాలు అయ్యాయి. చందూర్ 108 సిబ్బంది ఈఎంటీ రవి, పైలట్ వినోద్ ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.