NRPT: ఊట్కూర్ మండలానికి చెందిన కొక్కు గౌతంను బీఎస్పీ మక్తల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బొదిగేలి శ్రీనివాస్ తెలిపారు. కమిటీలో ఉపాధ్యక్షుడిగా పరశురామ్, ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్, కార్యదర్శిగా బస్వరాజ్, కోశాధికారిగా మల్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. పార్టీ లక్ష్యాల సాధనకు కొత్త కమిటీ కృషి చేస్తుందని నేతలు చెప్పారు.