NZB: జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో ఈనెల 11న ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డా.కేశవ బలిరామ్ పంత్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో స్ఫూర్తి మందిర భవన నిర్మాణం చేపడుతున్నారు. భరతమాత విగ్రహాన్ని సైతం మందిరంలో కొలువుదీర్చనున్నారు.