TG: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. దాదాపు రూ.4.6 కోట్ల విలువైన 13.2 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రయాణికుడితో పాటు మరో వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు.