JGL: గ్రామాల్లో పచ్చదనంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ సంధి రాజమణి అన్నారు. శుక్రవారం పెగడపల్లి మండలం నరసింహునిపేటలో ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట మొక్కలను నాటారు. మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.