PDPL: ఇటీవల రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేకమంది చనిపోతున్నారని, వాటిని నియంత్రణకు అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన పెద్దపల్లి మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన సమావేశంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.