WGL: నల్లబెల్లి మండలంలోని రేలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి రఘుపతిరావు తల్లి ఎర్రబెల్లి ప్రమీల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రఘుపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.