SRD: మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల మైదానంలో బేస్ బాల్ అండర్- 14 బాల, బాలికల జిల్లా ఎంపిక మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ తెలిపారు.