NZB: గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో శుక్రవారం 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 827 విద్యార్థులకు, 813 మంది విద్యార్థులు హాజరయ్యారు. 15 మంది గైర్హాజరయ్యారు. 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 210 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రంగరత్నం తెలిపారు.