PDPL: జిల్లాలో ఈనెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ టెన్త్ & ఇంటర్ పరీక్షలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని DEO శారద తెలిపారు. ఇవాళ ఆమె పరీక్షల నిర్మాణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 11 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక సౌకర్యాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.