ADB: రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఇచ్చోడ మండలంలోని అడిగామ గ్రామంలో నూతన చౌకదారుల దుకాణాన్ని ముఖ్యఅతిథిగా హాజరై స్థానికులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.