WNP: చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సూచించారు. ఇవాళ పెద్దమందడి మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. వనపర్తి శాసనసభ్యులు మెగారెడ్డి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమి చెందిన వారు మరింత కసిగా ఆట ప్రతిభను చాటాలన్నారు.