SDPT: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత ఆయుష్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆయుర్వేద, యునానీ, హోమియోపతి వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం ఆయుష్ సేవలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల ఈ ఆసుపత్రిలో 24 గంటల ఓపీ సౌకర్యం ఉందని, ప్రజలు ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.