గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలోని అయిజ – ఏ క్లాస్ పురం ప్రధాన రహదారిపై శుక్రవరం రోడ్డు ప్రమాదాల నివారణకు శుక్రవారం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ రహదారిపై వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో వృద్ధులు, చిన్నారులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.