RR: కొత్తూరు మండలం తిమ్మాపూర్లో అత్యవసర రక్షణ చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. SHO నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు భయపడకుండా వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే ఎలా స్పందించాలని అవగాహన కల్పించారు.