SRPT: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం సందర్శించారు. స్థానిక రవి మహల్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.