WGL: జిల్లా కేంద్రంలో 100 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. అప్పయ్య నిక్షయ్ పోషణ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ.. రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, సమతుల్య పోషకాహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని డా. అప్పయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డా. హిమబిందు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.