RR: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మీ పథకం అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాల ప్రయోజనం అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.