JN: ఆస్తి కోసం కన్నకొడుకులనే అంతమొందించాలని చూసిన తండ్రి బానోతు శ్రీనివాస్, అతడి రెండో భార్య మమతను రఘునాథపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పొట్టిగుబ్బడితండాకు చెందిన శ్రీనివాస్, తనభూమిని దక్కించుకోవడానికి ఇద్దరు కుమారులకు విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చి చంపాలని సుపారీ ఇచ్చినట్లు తేలడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.