NGKL: పెంట్లవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నర్సరీల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఏపీవో మోహన్ కృష్ణ ఆదేశించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామం తన నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలను పెంచాలని సూచించారు. పంచాయతీలకు అవసరమైన పండ్ల, పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నర్సరీల్లో ఉదయం, సాయంత్రం నీళ్లు పట్టాలని, ఖాళీ ప్రదేశాల్లో వెంటనే చెట్లు పెంచాలని కోరారు.