MHBD: భానుడు భగభగ మండుతుండడంతో తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి కూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేయాల్సి వస్తుంది. ఉపాధి చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ కనిపించిన దాఖలాలు లేవు. అధికారులు స్పందించి పని ప్రదేశాలలో వసతులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.