HYD: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వాతావరణంలో విపరీత మార్పులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతుండగా, రాత్రి సమయంలో 27 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. పగటి ఎండలు తీవ్రంగా ఉండగా, రాత్రి వాతావరణం చల్లగా మారుతుంది. ఉష్ణోగ్రత తేడా గమనించి, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.