NRML: నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షలతో S.H.G V.O భవన,షెడ్ నిర్మాణానికి రూ.18 లక్షలతో MPPS ,హై స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.