NLG: నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో ఈ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తులను అడ్డుపెట్టుకుని ఆన్లైన్ పేమెంట్ల రూపంలో లంచాలు తీసుకుంటున్నట్లు గుర్తించిన అధికారులు, పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.