HNK: ఐనవోలు మండలంలోని కస్తూర్బా గాంధీ, ZPHS పాఠశాలల్లో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీస్ అధికారులు అన్నారు.