WGL: రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.