MDK: జిల్లాలోని 492 పంచాయతీల్లో ‘అరైవ్ అలైవ్’ గ్రామసభలను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై గ్రామస్థులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆర్డీవోలు, ఎంపీడీవోలు, డీఎస్పీలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.