MNCL: ఏడీసీసీ సహకార బ్యాంక్ జన్నారం శాఖ నూతన మేనేజర్ గా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్ బదిలీపై వెళ్తున్నారు. దీంతో కొత్తగా వచ్చిన, బదిలీపై వెళ్తున్న మేనేజర్లను మంగళవారం ఏడీసీసీ బ్యాంకు కార్యాలయంలో ఖాతాదారులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఖాతాదారులకు మంచి సేవలు అందించాలని కోరారు.