ASF: ఆసిఫాబాద్ డివిజన్ ఏఎస్పీగా సేవలందించిన చిత్రంజన్ ఐపీఎస్ జిల్లా అదనపు ఎస్పీగా (అడ్మిన్) పదోన్నతి పొందారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్తో ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్రంజన్ తన నూతన బాధ్యతలను స్వీకరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.